బిగినర్స్ కొరకు స్టాక్ మార్కెట్ కి సంభందిచిన చిట్కాలు:


మనం ఇతరుల పైన ఆధార పడకుండా, మనమే Stock Market ని అనాలిసిస్ చేసి పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలంటె, మనం ఈ ఫీల్డ్ లో కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి.

మొదలు మనలో నాటుకు పోయిన కొన్ని అపోహలను తొలగించుకోవాలి.  ఉదాహరణకు 
(1) Stock Market లో పెట్టుబడులు చాలా రిస్క్ 
(2) Stock Market లో పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు వస్తాయి
(3) Stock Market అంటే ఒక గ్యాంబ్లింగ్.

ఎందుఅంటే మనపెట్టుబడులను ధీర్ఘ కాలం గా Stock Market లో ఉంచడం వలన మనం లాభాలు ఆర్జించవచ్చు.
ఈ క్రింది పట్టికను ఒక సారి గమనించండి.

మీతో చాల మంది ఇప్పటి వరకు డిస్కస్ చేసి ఉండవచ్చు.  వారు Stock Market లొ పెట్టుబడులు పెట్టగానే మార్కేట్ క్షీనించిందని మరియు వారికి నష్టాలు వచ్చాయని. అయితే మీరు పైన పేర్కొన బడిన పట్టిక ను గమనించండి. 1993 సంవత్సరములో సెన్సెక్స్ ఇండెక్స్ 4000 నుండి 4500 మద్యలో ఉన్నట్టు గమనించ వచ్చు. ఇది 1994 సంవత్సరములో 5000 వరకు చేరుకుంది. అప్పటి నుండి ఒడిదుడుకులను ఎదుర్కుంటు 2007 సంవత్సరములో అది 20,000 వరకు చేరుకుంది. అంటె దాదాపు 4 రేట్లు పెరగడమం మనం గమనించవచ్చు. మల్లి ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 2008 వ సంవత్సరములో దాదాపు 9,000 వరకు పడి పోవడమం మీరు గమనించ వచ్చు.  బహూశా మీకు తెలిసే ఉండవచ్చు,  2008 లో "సత్యం కంప్యూటర్స్" మోసం వలన మరియు "లీమన్ బ్రదర్స్" బ్యాంకు దివాలా తీసి మూసి వేయడం వలన స్టాక్ మార్కెట్ క్రుంగి పోవడం జరిగింది.  ఈ సమయం లో 9,000 వరకు పడిపోయిన సెన్సెక్స్ ఇండెక్స్ తదనంతరము తిరిగి కోలుకుని 2018 సంవత్సరము వచ్చే వరకు 38,000 వరకు చేరుకోవడం మీరు గమనించ వచ్చు. మల్లి January 2020 లో 42,000 మార్క్ ని టచ్ చేసిన సెన్సెక్స్ ఇండెక్స్, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఒకే సారి దాదాపు 25,000 మార్క్ వరకు పడి పోయింది. తిరిగి చాలా త్వరగా కోలుకుని April 2020 మాసాంతానికి అది 31,000 వరకు వచ్చింది.  ఇంత త్వరగా కొలుకోవడనికి కారణలలో ఒక కారణం రిలయన్స్ కంపెని యొక్క వాటాని ఫేస్ బుక్ వాల్లు ఖరిదు చేయడం.  అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా కావచ్చు.
ఇటువంటి ఆటుపోట్లు స్టాక్ మార్కేట్ లో సహజం.  కాని పై ఉదాహరణని గమనించి చూస్తే ఒక విషయం మనకు అర్థ మవుతుంది.  అది ఏంటంటే ధీర్ఘ కాలంగా పెట్టుబడులను స్టాక్ మార్కేట్ లో ఉంచడం వలన నష్టాలు వాటిల్లే అవకాశాలు చాలా తక్కువ.


This blog is under construction... pls visit again for further tips and updates.